హైదరాబాద్: తెలంగాణ రైతాంగాన్ని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ద్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలా పనిచేస్తోందని తప్పుబట్టారు. ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని గుర్తుచేశారు. వరి కొనుగోళ్లలో కేసీఆర్ చేతకానితనంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 30 లక్షల ఎకరాల్లో ధాన్యాన్నే కొనలేని కేసీఆర్.. కోటి ఎకరాల్లో ధాన్యం పండిస్తే పరిస్థితేంటి? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి