కేసీఆర్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు

ABN , First Publish Date - 2022-07-04T06:21:36+05:30 IST

టీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొని నాటకాలాడుతున్నాయని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

కేసీఆర్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వైఎస్‌ షర్మిల

 టీఆర్‌ఎ్‌సకు అమ్ముడుపోయిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

వైఎస్‌ షర్మిల

హుజూర్‌నగర్‌, గరిడేపల్లి, జూలై 3: టీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకొని నాటకాలాడుతున్నాయని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, హుజూర్‌నగర్‌ మండలాల్లో ఆదివారం 15కిలోమీటర్లు నడిచారు. వెంకట్రాంపురం క్రాస్‌ రోడ్డు నుంచి మొదలైన పాదయాత్ర చంద్రాయగూడెం, గారకుంటతండా, పరెడ్డిగూడెం, గానుగుబండ, లింగగిరి, సీతారాంపురం మీదుగా సర్వారం చేరుకుంది. గానుగుబండ, సర్వారం గ్రామాల్లో షర్మిలకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. సర్వారం గ్రామంలో గంగమ్మ బోనాల గంపను షర్మిల ఎత్తుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఆమె మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పశువుల సంతలా టీఆర్‌ఎస్‌ పార్టీకి అమ్ముడుపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వందల కోట్లు సీఎం కేసీఆర్‌ దోచుకున్నాడని, అందుకు ఆధారాలున్నాయని బీజేపీ నాయకులు చెబుతున్నారని, అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు జైలుకు పంపడంలేదని ప్రశ్నించారు. బీజేపీతో కేసీఆర్‌ ఒప్పందం చేసుకోవడం వల్లే అరెస్ట్‌ చేయడంలేదన్నారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే ఆ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరతారని అన్నారు. ఓట్లప్పుడు మాత్రమే ఫాంహౌస్‌ నుంచి కేసీఆర్‌కు బయటికి వస్తాడని అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కేసీఆర్‌ అమలుచేయలేదని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బ్యాంక్‌ ఖాతాలో రూ.860కోట్లు ఉన్నాయంటే, కేసీఆర్‌ వద్ద ఎన్ని వేల కోట్లు ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు.  


వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన కేసీఆర్‌ 

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసిన సీఎం కేసీఆర్‌ రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇస్తున్నాడని, అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేశాడన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో అల్లుడు, కుమారుడు మంత్రులు కాగా, బిడ్డ ఎమ్మెల్సీగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత తమ కుటుంబం అమెరికాకు పోతుందని చెప్పిన సీఎం కేసీఆర్‌ పదవులు ఇచ్చి లాలిపాట పాడుతున్నారన్నారు. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా ఎనిమిదేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.హైదరాబాద్‌లో బాలికపై అత్యాచారం చేసింది టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రుల పిల్లలు కాదా అని ప్రశ్నించారు. చిన్న పిల్లల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, సుతారి శ్రీనివాస్‌, పిట్టా రాంరెడ్డి, నీలం రమేష్‌, చైతన్యరెడ్డి, కామిశెట్టి రవికుమార్‌, ఆదెర్ల శ్రీనివా్‌సరెడ్డి, చందా సైదిరెడ్డి, ఆంజనేయులు, చారి, శాంతకుమార్‌, రాధారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T06:21:36+05:30 IST