హైదరాబాద్: అబద్ధాలు ఆడటంలో సీఎం కేసీఆర్ నెంబర్‌వన్ అని బీజేపీ నేత బండి సంజయ్ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు కావాల్సింది సెంటిమెంట్ రాజకీయమేనని విమర్శించారు. మంత్రులను ఢిల్లీకి పంపితే న్యాయం జరిగిందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం కావాలని కేసీఆర్‌కు లేదని, సమస్య కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నూకలు తినాలని కేంద్రమంత్రి షీయూష్ గోయల్ అనలేదని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వరి పండిస్తున్నారో.. గంజా పండిస్తున్నారో చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని బండి సంజయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి