Abn logo
Sep 5 2021 @ 20:57PM

కేసీఆర్‌.. ఇదేం ద్వంద్వ నీతి..?: బండి సంజయ్‌

వికారాబాద్‌: కొవిడ్‌సాకుతో హుజురాబాద్‌ ఉపఎన్నికలను వాయిదా వేయించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో విద్యాసంస్థలను ప్రారంభించడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీఆర్‌ఎస్‌ నేతలు ఉపఎన్నికను వాయిదా వేయించారని ఎద్దేవా చేశారు. కార్పొరేట్‌ స్కూళ్లు ఒక్కో విద్యార్థి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి టీఆర్‌ఎస్‌ నేతలకు కమీషన్లు ఇచ్చాయని ఆరోపించారు. ఫీజులు వసూలు చేసిన తరువాత కార్పోరేట్‌ విద్యా సంస్థలు కొవిడ్‌ సాకుతో స్కూళ్లను మూసేసిన విషయాన్ని సంజయ్‌ గుర్తు చేశారు.