మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-25T05:55:46+05:30 IST

తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, అందులో భాగంగానే మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం అందించడమే కేసీఆర్‌ లక్ష్యం
అదనపు వార్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చందర్‌

- ఎమ్మెల్యే చందర్‌

కళ్యాణ్‌నగర్‌, మే 24: తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించి ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, అందులో భాగంగానే మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఎన్‌టీపీసీకి చెందిన రూ.6.9కోట్ల సీఎస్‌ఆర్‌ నిధులతో 50పడకల అదనపు వార్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రావగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజలు అత్యవసర వైద్య అవసరాలు ఏర్పడినప్పుడు హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తుందని, మార్గమధ్యలో క్షతగాత్రులు, రోగులు మృతి చెందుతున్నారన్నారు. పరిశ్రమల కాలుష్యం భారిన పడి ప్రజలు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, పెద్ద మొత్తంలో చికిత్సకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ సామాన్యులకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకే మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారన్నారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు సరైన వైద్యం అందుతుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మేయర్‌ అనీల్‌ కుమార్‌ మాట్లాడుతూ గతంలో ఇక్కడ ప్రభుత్వాసుపత్రిలో అనేక సమస్యలు ఉండేవని, ఇప్పుడు అన్నీ రకాల వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎన్‌టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్‌) విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్‌టీపీసీ సంస్థ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.7కోట్లు వెచ్చించిందన్నారు. తాము అన్నీ సౌకర్యాలతో భవన నిర్మాణం చేయించి ఇచ్చామని, నిర్వహణ కూడా ముఖ్యమన్నారు. అప్పుడే రోగులకు సౌకర్యాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ హిమబిందు, జెడ్‌పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, కవితాసరోజిని, నాయకులు తోడేటి శంకర్‌గౌడ్‌, బొడ్డు రవీందర్‌, తిరుపతినాయక్‌, నూతి తిరుపతి, ముక్కెర రాజేశం, అడప శ్రీనివాస్‌, వీరాలాల్‌, సూపరింటెండెంట్‌ దయాల్‌సింగ్‌, శిరీష, రాజు, లక్ష్మి, నర్సింహా, భాను, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:55:46+05:30 IST