ఉప ఎన్నికల సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-07-31T05:55:37+05:30 IST

సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నికల ముఖ్యమంత్రిగా మారారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే సీఎం అభివృద్ధి జపం చేస్తున్నారని అన్నారు.

ఉప ఎన్నికల సీఎంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌

నిజామాబాద్‌అర్బన్‌, జూలైౖ 30: సీఎం కేసీఆర్‌ ఉప ఎన్నికల ముఖ్యమంత్రిగా మారారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన వి లేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసమే సీఎం అభివృద్ధి జపం చేస్తున్నారని అన్నారు. గ తంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉప ఎన్నికల్లో ప్రచా రం చేయలేదని, కానీ కేసీఆర్‌  మాత్రం ఉప ఎన్నికల ను పండుగలా భావిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారన్నా రు. దళితబంధు పథకం హుజూరాబాద్‌లో పెట్టడం కే వలం ఉప ఎన్నిక కోసమేనని అన్నారు. దళితులపై ప్రే మ ఉంటే రాష్ట్రం మొత్తం ఈ పథకాన్ని అమలు చే యాలన్నారు. దేశంలో బీజేపీ పాలనలో సామాన్యులు ఎవరు బాగుపడడం లేదని, కేవలం కార్పొరేట్‌ కంపెనీ లే బాగుపడ్డాయన్నారు. ఎంపీ అర్వింద్‌ అదృష్టవశాత్తు గెలిచిన ఎంపీ అని, ఆయన వయసుకు మించిన మా టలు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్‌, ఎంఐఎంలు ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీ ల్లో తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో జిల్లాలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈ ఏడేళ్లలో జరిగిందేమిలేదన్నారు. ఉ మ్మడి జిల్లాలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక మం త్రి, స్పీకర్‌, సీఎం కూతురు ఎమ్మెల్సీగా ఉన్నా జిల్లాకు ఏ ఒక్క గొప్ప కార్యక్రమం జరగలేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నగర అధ్యక్షుడు కేశవేణు, అర్బన్‌ ఇన్‌చా ర్జి తాహెర్‌బిన్‌ హుందాన్‌, మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌, రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొమురయ్య, నాయకులు హరిబా బు, రాంభూపాల్‌, మాజీద్‌ఖాన్‌, రామకృష్ణ, రామర్తిగో పి, వేణురాజ్‌, విపుల్‌ గౌడ్‌, దయాకర్‌ గౌడ్‌, గడుగు రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-07-31T05:55:37+05:30 IST