కేసీఆర్‌కు గులాంగిరీ చేస్తున్న పల్లా

ABN , First Publish Date - 2021-03-07T06:06:06+05:30 IST

ఎమ్మెల్సీగా ఆరేళ్లు పనిచేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని కేసీఆర్‌కు గులాంగిరీ చేసి కళాశాలస్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి ఎదిగి విద్యను వ్యాపారంలా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

కేసీఆర్‌కు గులాంగిరీ చేస్తున్న పల్లా
నల్లగొండలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు అధికారపార్టీ బెదిరింపులు 

పట్టభద్రులు దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వాలి  

టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

నల్లగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎమ్మెల్సీగా ఆరేళ్లు పనిచేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఏ ఒక్కరికీ న్యాయం చేయలేదని కేసీఆర్‌కు గులాంగిరీ చేసి కళాశాలస్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి ఎదిగి విద్యను వ్యాపారంలా మార్చారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నల్లగొండలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్న అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను బెదిరింపులకు గురి చేస్తోందని, ఈ విషయాన్ని కొంత మంది ఉపాధ్యాయ సంఘాల నేతలు తనకు ఫోన్‌ చేసి చెప్పారని తెలిపారు. సంఘాల నేతలు ప్రభుత్వానికి భయపడాల్సిన అవసరం లేదని, వారికి కాంగ్రెస్‌ అండగా నిలుస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు వైన్స్‌, మైన్స్‌, లాండ్‌, శాండ్‌ దందాలకు పాల్పడుతున్నారన్నారు. న్యాయవాదులను హతమార్చిన కేసులో టీఆర్‌ఎస్‌ నేతల హస్తం ఉందని, దీనిపై సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు నోరు మెదపలేదన్నారు. రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేయాల్సిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కూడా ఖాళీగా ఉందన్నారు. అందరినీ మోసం చేసిన కేసీఆర్‌ కు దిమ్మతిరిగే షాక్‌ను పట్టభద్రులు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతలు కొత్త బిక్షగాళ్లుగా వ్యవహారిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షులు శంకర్‌నాయక్‌, పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహాన్‌రెడ్డి, నాయకులు కొండేటి మల్లయ్య తదిరులు పాల్గొన్నారు. 


కాంగ్రె్‌సకు అనుకూల వాతావరణం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మిర్యాలగూడ, హాలియాలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను మోసం చేశాయన్నారు. సామాజిక న్యాయం కాంగ్రె్‌సతోనే సాధ్యమని, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిరిజనుడైన రాములునాయక్‌ను అభ్యర్థిగా నిలిపామన్నారు. సమావేశాల్లో ఎల్‌హెచ్‌పీఎ్‌స జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్‌, మిర్యాలగూడ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బీఎల్‌ఆర్‌, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-07T06:06:06+05:30 IST