తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-11-30T05:26:48+05:30 IST

తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్‌

తెలంగాణ గుండెచప్పుడు కేసీఆర్‌

మేడ్చల్‌ అర్బన్‌: తెలంగాణ ప్రత్యేక కాంక్షను నెరవేర్చిన మహానేత మన సీఎం కేసీఆర్‌ అని టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో కేసీఆర్‌ చేసిన ఆమరణ నిరాహార దీక్షతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. నవంబర్‌ 29న ఏ తెలంగాణ వాది మరిచిపోరని గుర్తుచేశారు. తన ప్రాణాలను ఫనంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్‌కు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందన్నారు.  14సంవత్సరాలు ఉద్యమం చేసి 60ఏళ్ల కలను  నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని వెల్లడించారు. 

Updated Date - 2020-11-30T05:26:48+05:30 IST