హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చౌరాసియాపై దాడి చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని ఆకతాయిలు ఆమెపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ పెనుగులాటలో నటి తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఓ ఆకతాయి ఆమె ముఖంపై పిడిగుద్దులు, బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న 8 ప్లస్ ఫోన్, నగలు, నగదు తీసుకుని వారు పరారయ్యారు. ఈ ఘటనపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నటి చౌరాసియాను ఆస్పత్రికి తరలించిన మిత్రులు, స్థానికులు వైద్యం అందిస్తున్నారు. అయితే ఆ దుండగులు ఎవరు..? ఎందుకు దాడి చేశారు..? అనే విషయాలు తెలియాల్సి ఉంది.