Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాట్రగడ్డ బాబుకు నివాళి

విద్యాధరపురం: కాట్రగడ్డ బాబు భౌతిక కాయాన్ని ఆదివారం టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నాయకుడు నాగుల్‌మీరా సందర్శించి నివాళులు అర్పించారు. ప్రజలకు, పార్టీకి బాబు చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వామపక్ష ఉద్యమాలకు బాబు సహకారం: దోనేపూడి శంకర్‌

కాట్రగడ్డ బాబు మృతదేహానికి నివాళులు అర్పించాక సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ మాట్లాడారు. బాబు సోదరుడు కాట్రగడ్డ వెంకట నారాయణ జీవితం కమ్యూనిస్టు ఉద్యమంతో పెనవేసుకుందన్నారు. వెంకట నారాయణ హత్యానంతరం బాబు టీడీపీలో చేరినా వామపక్ష భావజాలాన్ని విడిచిపెట్టలేదన్నారు. వామపక్ష ఉద్యమాలకు వివిధ రూపాలలో సహకరించారన్నారు. సీపీఐ నగర కమిటీ తరఫున ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నామన్నారు. 


Advertisement
Advertisement