ASSAM: కజిరంగా నేషనల్ పార్కుకు కొత్త ముప్పు.. ఆ మొక్కలతోనే ప్రమాదం అంటున్న శాస్త్రవేత్తలు

ABN , First Publish Date - 2022-06-27T23:02:10+05:30 IST

కజిరంగా నేషనల్‌ పార్క్‌ (కేఎన్‌పీ).. ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాల్లో మూడింట రెండువంతులు ఇక్కడే ఉన్నాయి.

ASSAM: కజిరంగా నేషనల్ పార్కుకు కొత్త ముప్పు.. ఆ మొక్కలతోనే ప్రమాదం అంటున్న శాస్త్రవేత్తలు

కజిరంగా నేషనల్‌ పార్క్‌ (కేఎన్‌పీ).. ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాల్లో మూడింట రెండువంతులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ 2600కు పైగా ఒంటికొమ్ము ఖడ్గమృగాలు నివసిస్తున్నాయి. ఇవే కాదు.. బెంగాల్ టైగర్స్, భారీ ఏనుగులు కూడా కజిరంగా నేషనల్‌ పార్క్‌‌లోని వివిధ రేంజ్‌లలో సంచరిస్తుంటాయి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కజిరంగా నేషనల్‌ పార్క్‌ ముంగిట ఓ సరికొత్త ముప్పు పొంచి ఉందట. ఈ పార్కులో వివిధ రేంజ్‌లలో సుమారు 17 రకాలు స్థానికేతర వృక్ష జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారట. ఇవి, చుట్టు పక్కల ప్రాంతాలను అతి వేగంగా ఆక్రమిస్తుండడంతో ఒంటికొమ్ము ఖడ్గమృగాల ఆవాసాలను నాశనం చేసే ప్రమాదం ఉందట. 


ఇది కూడా చదవండి..

Viral Video: కళ్ల ముందే కనిపించకుండా పోయిన ఇల్లు.. కళ్లు మూసి తెరిచేలోపే మాయమైపోయిందిలా..!


అంతే కాదు కేఎన్‌పీలోని గడ్డి భూములను, ఇతర జంతువుల ఆవాసాలను ఇవి నాశనం చేస్తున్నాయట. నీటి మడుగుల్లో పుట్టుకొచ్చిన కొన్ని మొక్కలు విషపూరిత స్వభావాన్ని కలిగి ఉన్నాయట. విపరీతంగా పెరుగుతున్న ఈ ఆక్రమణ జాతులను KNP డైరెక్టర్ జతీంద్ర శర్మ గుర్తించారు. కేఎన్‌పీలోని వివిధ రేంజ్‌లలో పర్యటిస్తున్నప్పుడు ఆయన వీటిని కనుగొన్నారు. వీటిని నరికివేయడానికి, కేఎన్‌పీ నుంచి సమూలంగా నిర్మూలించడానికి అనుమతి కావాలని సంబంధిత అధికారులను శర్మ కోరారు. ఈ మొక్కలను గుర్తించి వెంటనే నాశనం చేయకపోతే కజిరంగా నేషనల్‌ పార్క్‌‌లోని జంతువులకు ఆహారం, నివాసం విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-27T23:02:10+05:30 IST