‘కాయకల్ప’ అసె్‌సమెంట్‌ షురూ

ABN , First Publish Date - 2021-02-25T05:30:00+05:30 IST

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఏడాదికి సంబంధించిన కాయకల్ప అసె్‌సమెంట్‌ ప్రారంభమైంది.

‘కాయకల్ప’ అసె్‌సమెంట్‌ షురూ
సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి

 రేపు పీర్‌ అసె్‌సమెంట్‌

 జిల్లా ఆస్పత్రిని సందర్శించనున్న నిర్మల్‌ అధికారులు


సంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 25: సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఏడాదికి సంబంధించిన కాయకల్ప అసె్‌సమెంట్‌ ప్రారంభమైంది. కాయకల్ప పురస్కారాన్ని సాధించడమే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు స్వచ్ఛబాటలో పయనించాలన్న ఉద్దేశంతో కేంద్రం కాయకల్ప పథకాన్ని 2015లో ప్రవేశపెట్టింది. ఆస్పత్రులను శుభ్రంగా ఉంచుతూ నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలందిస్తే కాయకల్ప పురస్కారంలో భాగంగా ప్రత్యేక నిధులను కేంద్రం ఆస్పత్రులకు కేటాయిస్తున్నది. ఆ నిధులను ఆస్పత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఇలా ఉండగా సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రిని పీర్‌ అసె్‌సమెంట్‌లో భాగంగా నిర్మల్‌ జిల్లా ఆస్పత్రి అధికారులు శనివారం సందర్శించనున్నారు. బయోమెడికల్‌ మేనేజ్‌మెంట్‌, శానిటేషన్‌, ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌, సపోర్ట్‌ సర్వీసెస్‌, బియండ్‌ బౌండ్రీవాల్‌, హైజీన్‌ ప్రమోషన్‌, ఫెసిలిటీ ఆఫ్‌ కీపింగ్‌, ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, చెక్‌లిస్ట్‌ ప్రకారం నిబంధనల అమలు తదితర అంశాలను పరిశీలించి రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిస్తారు. 70 శాతానికి పైగా మార్కులు స్కోర్‌ చేస్తే చివరి దశలో పెద్దాస్పత్రి పోటీకి అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత చివరి అసె్‌సమెంట్‌లో కేంద్ర బృందం సభ్యులు ఆస్పత్రిని సందర్శించి కాయకల్ప అవార్డుకు ఎంపిక చేస్తారు. జిల్లా ఆస్పత్రికి అవార్డు వరిస్తే రూ.50 లక్షల ప్రోత్సాహక నగదు దక్కనుంది.

Updated Date - 2021-02-25T05:30:00+05:30 IST