Advertisement
Advertisement
Abn logo
Advertisement

10 నుంచి లండన్‌లో బతుకమ్మ.. పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 10 నుంచి లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. తెలంగాణ జాగృతి లండన్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృ తి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి ప్రతినిధులను  అభినందించారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొ నే ఆడబిడ్డలకు చేనేత చీరలను అందించనున్నామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్‌ బల్మూరి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement