ఎమ్మెల్సీ కవితకు తప్పిన ముప్పు

ABN , First Publish Date - 2021-02-26T00:29:57+05:30 IST

మాల్యాల మండలం కొండగట్టు దగ్గర ఎమ్మెల్సీ కవితకు ముప్పు తప్పింది. కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాల్లో

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ముప్పు

జగిత్యాల: మాల్యాల మండలం కొండగట్టు దగ్గర ఎమ్మెల్సీ కవితకు ముప్పు తప్పింది. కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాల్లో ఒకదానిని మరొకటి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే రవిశంకర్‌ కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కవిత కారులో రవిశంకర్‌ ఉన్నారు. అంతకుముందు ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను కవిత దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-02-26T00:29:57+05:30 IST