Kaveri నదిలో రైతుల నిరసన

ABN , First Publish Date - 2022-04-22T15:49:26+05:30 IST

నామక్కల్‌ జిల్లా మోగనూరు- కరూర్‌ జిల్లా నెరూర్‌ ప్రాంతాల మధ్య చెక్‌డ్యాం పథకాన్ని అమలు చేయాలని కోరుతూ రైతులు గురువారం ఉదయం కావేరి నదిలో దిగి నిరసన వ్యక్తం చేశారు.

Kaveri నదిలో రైతుల నిరసన

పెరంబూర్‌(చెన్నై): నామక్కల్‌ జిల్లా మోగనూరు- కరూర్‌ జిల్లా నెరూర్‌ ప్రాంతాల మధ్య చెక్‌డ్యాం పథకాన్ని అమలు చేయాలని కోరుతూ రైతులు గురువారం ఉదయం కావేరి నదిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. మోగనూరు-నెరూర్‌ల మధ్య కావేరి నదికి అడ్డుగా రూ.700 కోట్లతో చెక్‌డ్యాం ఏర్పాటుచేయనున్నట్లు గత ఏడాది జరిగిన అసెంబ్లీ సమావేశంలో సీఎం ప్రకటించారు. అయితే ఈ పథకాన్ని రద్దుచేస్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవోను పునః పరిశీలించాలని నామక్కల్‌, కరూర్‌, తిరుచ్చి జిల్లాల రైతులు ప్రభుత్వానికి లేఖల ద్వారా విన్నవించుకున్నారు. దీనిని అమలుపరచాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఉదయం మోగనూరు కావేరి నదిలో దిగి సుమారు 500 మందికిపైగా రైతులు ఆందోళన చేపట్టారు. తమ అభ్యర్ధనను ప్రభుత్వం అమలుపరచకుంటే రాష్ట్రంలోని మిగతా రైతు సంఘాలతో కలసి భారీస్థాయులో ఆందోళన చేపడతామని తమిళనాడు రైతుల సంఘ అధ్యక్షుడు రాసామణి హెచ్చరించారు.

Updated Date - 2022-04-22T15:49:26+05:30 IST