కౌంటింగ్‌ ఏర్పాట్ల పరిశీలన

ABN , First Publish Date - 2021-09-18T05:44:33+05:30 IST

ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈనెల 19న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసి ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్ర వారం టెక్కలిలో కౌంటింగ్‌ కేంద్రాన్ని సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రంలో లెక్కింపు సమయంలో శాంతి భద్రత పరిరక్షణ చర్యలపై పోలీ సులతో మాట్లాడారు.

కౌంటింగ్‌ ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్లను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

టెక్కలి: ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈనెల 19న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసి ఓట్ల లెక్కింపు సందర్భంగా శుక్ర వారం టెక్కలిలో కౌంటింగ్‌ కేంద్రాన్ని సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్‌ కేంద్రంలో లెక్కింపు సమయంలో శాంతి భద్రత పరిరక్షణ చర్యలపై పోలీసులతో మాట్లాడారు.ఆయనతో పాటు సీఐ నీలయ్య, టెక్కలి, నందిగాం ఎంపీడీవోలు హెచ్‌వీ రమణ మూర్తి, ఫణీంద్రకుమార్‌ తదితరులున్నారు.  


ఏర్పాట్లు పూర్తి

 నరసన్నపేట: ప్రాదేశిక ఓట్లు లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు  మండల ప్రత్యేకాధికారి, జిల్లా సహాయక ఆడిట్‌ అధికారి సీహెచ్‌ ప్రభావతి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. నరసన్నపేట, జలుమూరు, పోలాకి, సారవకోట మండలాలకు చెందిన 88 మండల ప్రాదేశిక నియోజకవర్గాల  కౌటింగ్‌ నిర్వహణపై సూచనలిచ్చారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను, కౌటింగ్‌ కౌంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో జీవీ రవి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 



నిబంధనలు పాటించాలి

 హిరమండలం:  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌లో నిబంధనలు పాటించాలని ఎన్నికల ప్రత్యేకాధికారి కిశోర్‌ అన్నారు. శుక్ర వారం మండల పరిషత్‌ కార్యాలయంలో  అభ్యర్థులు, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిం చారు. ఓట్ల లెక్కింపు అనంతరం విజేతలు ఊరేగింపులు, ఉత్సవాలు నిర్వహించకూడద న్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఎంపీడీవో వెంకట రాజు, తహసీల్దార్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

 

Updated Date - 2021-09-18T05:44:33+05:30 IST