Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 17 Aug 2022 11:16:56 IST

Katrina Kaif: తల్లి కాబోతున్న కత్రినా..? ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..

twitter-iconwatsapp-iconfb-icon

బాలీవుడ్‌లోని క్రేజీ హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ (Katrina Kaif) ఒకరు. ఈ బ్యూటీ గతేడాది డిసెంబర్‌లో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్‌(Vicky Kaushal)ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట గురించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. గతకొంతకాలంగా ఈ కపుల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కత్రినా ముంబైలో ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఆ వీడియోలో కత్రినా వైట్ టీషర్ట్, ఆరెంజ్ కలర్ ప్యాంట్‌లో చాలా స్టైలిష్‌గా ఉంది. అయితే ఈ బ్యూటీ కొంచెం లావైనట్లు కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కత్రినా బరువు పెరగకుండా చాలా జాగ్రత్తగా ఫిజిక్‌ని మెయిన్‌టెన్ చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ తార లావుగా కనిపించడానికి కారణం ఆమె గర్భవతి(Pregnant) కావడమే కారణమంటూ నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఆమె గర్భవతిలా కనిపిస్తోంది. అది నిజమైతే చాలా బావుండు’ అంటూ కొందరు.. ‘త్వరలో క్యాట్ శుభవార్త చెప్పబోతోంది. ఆమె గర్భవతిలా కనిపిస్తోంది’ అని మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement