విక్కీ కౌశల్, Katrina Kaif ల పెళ్లి డేట్ ఫిక్స్.. సరిగ్గా ఎన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారంటే..

విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి బాలీవుడ్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది. డిసెంబరు రెండో వారంలో వీరి వివాహం జరగనుందని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. వీరి పెళ్లి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. రాజస్థాన్ లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో  డిసెంబరు 9న వీరి వివాహం జరగనుంది.  ఈ లవ్ బర్డ్స్ డిసెంబరు 9న పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని కత్రినా కైఫ్ దగ్గరి బంధువు తెలిపారు. ఆ రోజున సాయంత్రం హిందూ సాంప్రదాయం ప్రకారం వీరు మనువు ఆడనున్నారని సమాచారం. 


పెళ్లికి 2 కుటుంబాలకు చెందిన దగ్గరి బంధవులు, సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు  చెబుతున్నారు. పెళ్లికి ముందు జరిగే సంబరాలైన మెహందీ, సంగీత్ డిసెంబర్ 7, 8వ తేదీల్లో జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి అతిథులుగా 200మంది వరకు హాజరు కాబోతున్నారు. పెళ్లికి 12 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మెహందీ ఫంక్షన్ కోసం కూడా కత్రినా కైఫ్ భారీగానే ఖర్చు చేస్తోంది. దాదాపుగా రూ. 1లక్ష వరకు ఈ ఫంక్షన్ కోసం వెచ్చిస్తోంది.  

Advertisement