Vicky Kaushal, కత్రినా పెళ్లి సంగీత్.. ఎవరెవరూ పర్‌ఫామ్ చేయనున్నారో తెలుసా..

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, బ్యూటీపుల్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహంతో ఒకటి కాబోతున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గురించి ఎవరూ కన్‌ఫామ్ చేయకున్న రోజుకో న్యూస్ పుట్టుకోస్తోంది.


వార్తల ప్రకారం, రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో డిసెంబర్ 9న పెళ్లి పీటలు ఎక్కాబోతున్నారు విక్కీ, కత్రినా జంట. కాగా దాదాపు 200 మంది బాలీవుడ్ సెటబ్రిటీలు హాజరు కానున్న వీరి పెళ్లి సంగీత్ డిసెంబర్ 7న రాత్రి జరగనుంది.


ఈ సంగీత్ వధువు, వరుడితో పాటు కియారా అడ్వాణీ, సారా అలీఖాన్ వంటి తారలతో పాటు మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులు.. ‘కాలా చష్మా’, నాచ్డే నే సారే’, ‘తేరి ఓరే’ వంటి పాటలకు ఫర్ఫామెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. సింగర్ గుర్‌దాస్ మన్ కూడా తన పాటలతో అలరించే అవకాశం ఉంది. 


ముఖ్యంగా విక్కీ కౌశల్ అయితే ప్రత్యేకంగా పంజాబీ సాంగ్స్‌కి డ్యాన్స్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. కత్రినా, ఆమె కజిన్స్ హిందీ, ఇంగ్లీష్ రొమాంటిక్ సాంగ్స్ చేయనున్నట్లు తెలియవస్తోంది. కాగా వీరి కుటుంబ సభ్యులను రిసీవ్ చేసుకోడానికి ఎయిర్‌పోర్ట్ వద్ద మూడు లగ్జరీ కార్లను ఈవెంట్ మేనేజ్‌మెంట్ నిర్వహకులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.

Advertisement

Bollywoodమరిన్ని...