Abn logo
Aug 14 2020 @ 15:03PM

క‌త్తి మ‌హేశ్ అరెస్ట్‌..

రాముడు, రాజ‌కీయాలు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే వారిలో క‌త్తి మ‌హేశ్ ఒక‌రు. ఓసారి త‌న వివాదాస్ప‌ద వ్యాఖ్యల కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన సంగ‌తి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో క‌త్తి మ‌హేశ్ పోస్టులు చేశారు. ఈ పోస్టుల‌పై ప‌లు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. వారి ఫిర్యాదులు ఆధారంగా ఐపీసీ సెక్ష‌న్ 153 ఎ క‌మ్యూన‌ల్ యాక్ట్ కింద కేసు న‌మోదు చేసుకున్న సైబ‌ర్ క్రైమ్ పోలీసులు పలు విచారణల అనంతరం శుక్ర‌వారం  క‌త్తి మ‌హేశ్‌ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా హాస్పిట‌ల్‌లో ప‌రీక్ష‌ల అనంత‌రం ఆయన్ని నాంప‌ల్లి కోర్టులో హాజ‌రు ప‌రిచారు. కోర్టు ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. 

Advertisement
Advertisement
Advertisement