Jul 23 2021 @ 18:47PM

‘కథ కంచికి మనం ఇంటికి’ టైటిల్ సాంగ్ విడుద‌ల‌

యంగ్ హీరో అరుణ్ ఆదిత్, పూజిత పొన్నాడ జంటగా ఎమ్.పి. ఆర్ట్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు చాణక్య చిన్న రూపొందిస్తోన్న చిత్రం ‘క‌థ కంచికి మ‌నం ఇంటికి’. పక్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్‌టైనర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యంగ్ ప్రొడ్యూస‌ర్ మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది. క‌థ కంచికి మ‌నం ఇంటికి టైటిల్‌నే నేప‌థ్యంగా తీసుకుని పురాణాల ద‌గ్గ‌ర నుంచి నేటి త‌రం జెన‌రేష‌న్ వ‌రకు అన్ని ముఖ్యాంశాల్ని క‌లుపుతూ తేలికైన ప‌దాల‌తో లిరిక్ రైట‌ర్ శ్రీనివాస తేజ ఈ పాట‌కు సాహిత్యం అందించారు. సంగీత ద‌ర్శకుడు భీమ్స్ సిసిరోలియో అంతే చక్కగా సాంగ్‌ను డిజైన్ చేశారు. ప్ర‌స్తుతం ఈ సాంగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

పాట లిరిక్స్:

అయ్య మాట కోసమంటు

రాములోరు అడివికెళితే

రాకాసోడు మాయచేసి సీతనెత్తుకెళ్లిపోతే

రాముడొచ్చి యుద్దమాడి

రావణుడి తలను కొడితే

సీతమ్మోరి సెయ్యి పట్టి

తిరిగి ఇంటికెళ్లిపోతే

పట్టాభిషిక్తుడై పరిపాలిస్తే

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి


పాచికల ఆటలోన

పాండవులు ఓడిపోతె

పాంచాలి కొకలాగి

కౌరవులు రెచ్చిపోతె

కిట్టమూర్తి ఎంటరయ్యి

కొట్టుకుని సావమంటే

కొట్లాట లోన కౌరవులు రాలిపోతే

కధ నడిపించిన కన్నయ్య నవ్వితే

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి


అమరేంద్ర బాహుబలి

కాలకేయ తాట తీస్తే

బళ్లాల దేవుడు

కుళ్లుకుని పథకమేస్తే

కట్టప్ప బాహుబలిని

వెన్ను పోటు పొడిస్తే

నీటి కొండ ఎక్కి శివుడు

బళ్లాల బెండు తీస్తే

మహేంద్ర బాహుబలి

మహారాజు అయితే

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి


ఎన్ టి ఆర్ ఏ ఎన్ ఆర్

సూపర్ స్టార్ రెబల్ స్టార్

శోభన్ బాబు మెగాస్టార్

బాలయ్య నాగార్జున

వెంకటేష్ పవర్ స్టార్

జూనియర్ ఎన్టీఆర్

ప్రిన్స్ బాబు ప్రభాసు

రామ్ చరణ్ అల్లుఅర్జున్

హీరోలంతా కలిసి ఏ సినిమా తీసినా

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి


హరి కధలు బుర్ర కధలు

తోలు బొమ్మలు నాటకాలు

చందమామ చిట్టి కధలు

తాత భామ పొట్టి కథలు

పెదరాసి పెద్దమ్మ

రాజుల కధలు

చాగంటి గరికపాటి

గమ్మత్తు కధలు

అనగనగఅనగని ఏ కధలు చెప్పినా

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి

కధ కంచికి మన మింటికి