పెట్రోల్‌కు కటకట

ABN , First Publish Date - 2022-05-24T05:46:13+05:30 IST

పాడేరులో రోజురోజుకూ పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలు పెరుగుతున్నాయి.

పెట్రోల్‌కు కటకట
పాడేరులోని బంకు వద్ద పెట్రోల్‌ కోసం బారులుతీరిన వాహనదారులు


బంకులకు పెట్రో ఉత్పత్తులు సక్రమంగా సరఫరాకాక ఇబ్బందులు

వాహనచోదకులకు తప్పని అవస్థలు

గంటల తరబడి వేచి ఉంటే ఒకట్రెండు లీటర్లే గతి

పాడేరురూరల్‌, మే 23: పాడేరులో రోజురోజుకూ పెట్రోల్‌, డీజిల్‌ కష్టాలు పెరుగుతున్నాయి. పాడేరులోని నాలుగు బంకులకు గాను ఒకే ఒక్క బంకుకు సోమవారం ట్యాంకర్‌ రావడంతో వాహనదారులు ఆ బంకు వైపు పరుగులు తీశారు. గంటల తరబడి నిరీక్షించి ఒకటి, రెండు లీటర్లు మాత్రమే పెట్రోల్‌ కొనుగోలు చేయగలిగారు. అందరికీ ఇంధనం అందాలన్న ఉద్దేశంతో బంకు నిర్వాహకులు అంతకన్నా ఎక్కువ ఇవ్వడం లేదు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ పరిస్థితిని వివరిస్తే వారికి మరో రెండు లీటర్ల వరకు ఇస్తున్నారు. వాస్తవానికి విశాఖ నుంచి వచ్చే ట్యాంకర్‌ రోజుకో బంకుకు పెట్రోల్‌, డీజిల్‌ సరఫరా చేస్తుంది. అయితే కొద్ది రోజులుగా మూడు రోజులకోసారి ఒక బంకు చొప్పున ఇంధనం సరఫరా చేస్తుండడంతో వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు.


Updated Date - 2022-05-24T05:46:13+05:30 IST