అనాథలు, పేద బాలికలకు కస్తూర్బా ఆసరా

ABN , First Publish Date - 2021-06-22T06:54:45+05:30 IST

తల్లి లేదా తండ్రిని, ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలికలు, నిరుపేద బాలికలకు కస్తూర్బా విద్యాలయాలు నాణ్యమైన విద్య అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2004లో సర్వశిక్షా అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలలు ప్రారంభించింది.

అనాథలు, పేద బాలికలకు కస్తూర్బా ఆసరా

సెల్‌ఫోన్‌లోనూ దరఖాస్తు చేసుకునే అవకాశం

6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అడ్మిషన్లు ప్రారంభం


 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : తల్లి లేదా తండ్రిని, ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా మిగిలిన బాలికలు, నిరుపేద బాలికలకు కస్తూర్బా విద్యాలయాలు నాణ్యమైన విద్య అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2004లో సర్వశిక్షా అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఈ పాఠశాలలు ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన బాలికలకు ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు. చదువును మధ్యలోనే నిలిపివేసిన, ఇప్పటి వరకు పాఠశాలకు వెళ్లని, అనాథలైన, పేదతరగతి చెందిన బాలికలకు అడ్మిషన్‌ ఇస్తారు. విద్యతోపాటు వసతి కూడా కల్పిస్తారు.                

     

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)ల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు.  కరో నా పరిస్థితుల దృష్ట్యా విద్యార్థినులు నేరుగా ఆయా మండలాల్లోని పాఠశాలలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, స్థానిక పాఠశాల ప్రత్యేక అధికారిని(ఎ ్‌సవో)ను సంప్రదించి అడ్మిషన్‌ పొందే వెసులుబాటును విద్యాశాఖ కల్పించింది. సెల్‌ఫోన్‌ ద్వారా స్థానిక ఎస్‌వో కు విద్యార్థినులు వివరాలు పంపితే, పరిశీలిం చి అడ్మిషన్‌ కల్పిస్తారు. కేజీబీవీల్లో 10వతరగతి పూర్తిచేసిన వారికే ఇంటర్‌లో అవకాశం కల్పిస్తారు. కరోనా దృష్ట్యా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ తరగతులే కొనసాగాయి దీంతో ఇంటర్‌లో అడ్మిషన్‌కోసం పదోతరగతి విద్యార్థినులు ఇంటర్‌ దరఖాస్తును సెల్‌ఫోన్‌లో పంపాల్సి ఉంటుంది. అర్హులైనవారు జూలై 1లోగా దరఖాస్తు చేసుకొని అడ్మిష న్లు పొందాల్సి ఉంటుంది.


అర్హులు ఎవరంటే..

తల్లిదండ్రులు లేని అనాథ బాలికలు, తల్లి కానీ తండ్రి కానీ లేనివారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు అడ్మిషన్‌ పొందేందుకు అర్హులు. ఈ పాఠశాలల్లో అడ్మిషన్‌ పొందిన బాలికలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తుంది. ఉచిత భోజనం, వస తి, స్కూల్‌ డ్రెస్‌, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, కాస్మొటిక్‌ చార్జీలు, పదో తరగతి పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశాలకు నర్సింగ్‌ కోర్సులో కూడా ప్రవేశం కల్పిస్తారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 56 కేజీబీవీలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం 27 కేజీవీబీలు ఉండగా, అందు లో 9 ఇంటర్‌, సూర్యాపేటలో 18 కేజీబీవీలు ఉండగా, 5 ఇంటర్‌, యాదాద్రిలో 11 కేజీబీవీలు ఉండగా, అందులో 5 పాఠశాలల్లో ఇంటర్‌ వరకు విద్యను అభ్యసించే అవకాశం ఉంది.  ఒక్కో తరగతిలో 40మందికి అడ్మిషన్‌ కల్పిస్తారు. కొత్తగా 6వ తరగతిలో అడ్మిషన్‌లతోపాటు, 7 నుంచి 10వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయనున్నారు. ఇంటర్‌ జనరల్‌ కోర్సులతోపాటు వృత్తి విద్యా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.


పేదబాలికలు సద్వినియోగం చేసుకోవాలి : భిక్షపతి, నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి

కేజీబీవీ పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికలు వారి సెల్‌ఫోన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపి ఎస్‌వోకు పంపితే సరిపోతుంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానం అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనలు ఎత్తివేసినందున నేరుగా కూడా స్థానిక ఎస్‌వోలను సంప్రదించవచ్చు. ఆగస్టు వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం ఉచితంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందున ఈ అవకాశాన్ని పేద బాలికలు సద్వినియోగం చేసుకోవాలి.


Updated Date - 2021-06-22T06:54:45+05:30 IST