కాస్తైనా మారానా

ABN , First Publish Date - 2020-04-05T07:15:22+05:30 IST

నిన్నటి నీ దర్పం ఆవిరైపోయింది కత్తి విడిచి సాము చేశావుగా గడప దాటగలవా! గడియ తీసి గద్దించగలవా!...

కాస్తైనా మారానా

నిన్నటి నీ దర్పం

ఆవిరైపోయింది

కత్తి విడిచి సాము చేశావుగా

గడప దాటగలవా! 

గడియ తీసి గద్దించగలవా! 


అద్దం ముందు నిలబడు

అడిగిందే అడుగు

కరోనా కాస్తైనా మారానా..

నా అహంకారాన్ని అసూయని

అందలాన్నీ అవినీతీని

పదవీ వ్యామోహాన్ని, ప్రాపకాన్ని

శాశ్వతంగా తీసుకుపో..

కల్మషాన్నంతా మింగి

కాలగర్భంలో కలిసిపో.. 

శశి కిరణ్ కొమాండూర్

Updated Date - 2020-04-05T07:15:22+05:30 IST