ఏపీ డీజీపీగా కసిరెడ్డికి అర్హత లేదు: ఎంపీ రఘురామ

ABN , First Publish Date - 2022-03-02T22:46:41+05:30 IST

ఏపీ కొత్త డీజీపీ నియామకంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

ఏపీ డీజీపీగా కసిరెడ్డికి అర్హత లేదు: ఎంపీ రఘురామ

అమరావతి: ఏపీ కొత్త డీజీపీ నియామకంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యూపీఎస్సీ చైర్మన్‌ ప్రదీప్‌కుమార్‌ జోషీకి ఎంపీ రఘురామ లేఖ రాశారు. ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి ఆ అర్హత లేదని  రఘురామ పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా, సొంత సామాజిక వర్గానికి చెందిన వాడని కసిరెడ్డిని డీజీపీ చేశారని ఆయన ఆరోపించారు. డీజీ స్థాయి అధికారులు ఉండగా ఏడీజీ స్థాయి కసిరెడ్డికి ఉన్నతపీఠం కట్టబెట్టారన్నారు. డీజీ ర్యాంకులో ఉన్న 12 మంది అధికారులకు అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్రం, యూపీఎస్సీ వెంటనే జోక్యం చేసుకుని ఏపీలో స్వచ్ఛమైన పాలన సాగేలా చూడాలని రఘురామ కోరారు. గౌతం సవాంగ్‌ పేరుతో కలిపి ముగ్గురు అధికారుల పేర్లతో ప్రతిపాదనలు పంపేలా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. సీనియార్టీ, మెరిట్‌ ప్రాతిపదికన ముగ్గురు సీనియర్‌ అధికారుల జాబితాకు వెంటనే జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో ఎంపీ రఘురామ విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-03-02T22:46:41+05:30 IST