Advertisement
Advertisement
Abn logo
Advertisement

కష్టించే వారికి జనసేనలో సముచితస్థానం

నాయుడుపేట, జనవరి 5 : కష్టపడి పనిచేసే కార్యకర్తలకు జనసేన పార్టీలో సముచితస్థానం లభిస్తుందని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి ఉయ్యాల ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. నాయుడుపేటలోని మినీ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం  నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లోని ఆ పార్టీ క్రియాశీలక సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన కార్యకర్తలు అందరూ  ప్రజల్లోకి వెళ్లి  ప్రస్తుత పరిస్థితులను తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం జనసేనలో క్రియాశీలక సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఇన్సూరెన్స్‌ కిట్‌లను అందజేశారు. 

Advertisement
Advertisement