సంద‌ర్శ‌న‌కు సిద్ధ‌మైన క‌శ్మీర్‌.... ప‌ర్యాట‌క‌శాఖ సిబ్బందికి టీకాలు!

ABN , First Publish Date - 2021-06-24T18:00:35+05:30 IST

కరోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో...

సంద‌ర్శ‌న‌కు సిద్ధ‌మైన క‌శ్మీర్‌.... ప‌ర్యాట‌క‌శాఖ సిబ్బందికి టీకాలు!

శ్రీన‌గ‌ర్‌: కరోనా సెకెండ్ వేవ్ త‌గ్గుముఖం ప‌డుతున్న స‌మ‌యంలో ప‌ర్యాట‌కుల కోసం జమ్మూక‌శ్మీర్ సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం రాష్ట్రంలోని టూరిజం రంగానికి సంబంధించిన వారికి టీకాలు వేయడం మొదలుకొని, వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జె అండ్ కె టూరిజం విభాగం కృషి చేస్తోంది. పర్యాటకులు రాష్ట్రానికి వ‌చ్చేందుకు కాశ్మీర్‌లోని పర్యాటక శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సంద‌ర్భంగా ప‌ర్యాట‌క‌శాఖ అధికారి ఒక‌రు మాట్లాడుతూ కరోనా మార్గదర్శకాల‌ను అంద‌రూ పాటించాల‌ని కోరారు. దాల్ లేక్ చుట్టూ ఉన్న హౌస్ బోట్ యజమానులు,హోటల్ సిబ్బందితో సహా 85 శాతం పర్యాటక భాగ‌స్వాముల‌కు టీకాలు వేశామ‌న్నారు. పర్యాటక ప్రదేశాలైన సోన్‌మార్గ్, దుధ్‌పత్రి, యుస్మార్గ్, పహల్గావ్‌, గుల్‌మార్గ్‌లలో కూడా టీకా డ్రైవ్‌లు నిర్వహించామ‌ని తెలిపారు. 

Updated Date - 2021-06-24T18:00:35+05:30 IST