కోతలు లేకుండా విడుదలకు సిద్ధం
ముంబై, మార్చి 31: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (యూఏఈ) విడుదలకు సిద్ధమైంది. అది కూడా ఎలాంటి కోతలు లేకుండా ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. చిత్రాన్ని యూఏఈ అధికారులు నాలుగు వారాలు పరిశీలించిన తర్వాత ఎలాంటి కోతలు విధించకుండా విడుదల చేస్తున్నారని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
‘‘ఇది మా చిత్రానికి దక్కిన భారీ విజయం. యూఏఈ అధికారుల నుంచి సినిమాకు సెన్సార్ అనుమతి వచ్చింది. త్వరలో సింగపూర్‌లోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఇస్లామోఫోబియాను పెంచేలా సినిమా ఉందని, ఆ చిత్రాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడేమంటారు?. సినిమా ఉగ్రవాదానికి మాత్రమే వ్యతిరేకమని అధికారులు ఒప్పుకొన్నారు’’ అని వివేక్ ట్వీట్ చేశారు.