శ్రీ కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో భారీ చోరీ

ABN , First Publish Date - 2021-05-12T15:20:49+05:30 IST

కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని 7వ ఫేజ్‌ కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే..

శ్రీ కాశీవిశ్వనాథస్వామి ఆలయంలో భారీ చోరీ

సీసీ కెమెరా వైర్లు కట్‌ చేసి చోరీకి పాల్పడిన దుండగులు 


హైదరాబాద్/హైదర్‌నగర్‌: కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని 7వ ఫేజ్‌ కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. వివరాల్లోకి వెళితే.. 7వ ఫేజ్‌లోని శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథస్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్న వి.వెంకటేశ్వరశర్మ సోమవారం రాత్రి 9గంటల సమయంలో గుడికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు మంగళవారం ఉదయం 5.30 గంటల సమయంలో గుడికి వచ్చి తలుపు తెరిచి చూసే సరికి స్వామి వారి కిరీటం, ఆభరణలు కనపడలేదు. ఆలయంలోని హుండీ కూడా పగలగొట్టి ఉండడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న డీఐ శ్యాంబాబు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. దొంగలు ముందుగానే సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేసి ఆలయంలోకి ప్రవేశించారని తెలిపారు. సుమారు 11 కిలోల స్వామి వారి వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ పూజారి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-12T15:20:49+05:30 IST