Kashimedu ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-05-19T14:18:42+05:30 IST

స్థానిక రాయపురం నియోజకవర్గం కాశిమేడులోని ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంగణంలో విడిభాగాలు భద్రపరిచిన ప్రాంతం నుంచి బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో ఆ

Kashimedu ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం

 చెన్నై: స్థానిక రాయపురం నియోజకవర్గం కాశిమేడులోని ఫిషింగ్‌ హార్బర్‌ ప్రాంగణంలో విడిభాగాలు భద్రపరిచిన ప్రాంతం నుంచి బుధవారం మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా  పొగ వ్యాపించడంతో స్థానిక మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. పాత పడవల విడిభాగాల ప్రాంతం నుంచి హఠాత్తుగా మంటలు వ్యాపించాయని అందిన సమాచారంతో తండయార్‌పేట, వాషర్‌మెన్‌పేట ప్రాంతాల నుంచి మూడు ఫైరింజన్‌లలో వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటకు పైగా పోరాడి మంటలు అదుపుచేశారు. దీనిపై కాశిమేడు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-05-19T14:18:42+05:30 IST