మావాళ్లను వెనక్కి రప్పించండి.. ప్రభుత్వానికి జనగామ వాసులు విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-03-26T19:21:12+05:30 IST

కాశీ పుణ్యక్షేత్రంలో జనగామ జిల్లా వాసులు చిక్కుకున్నారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన వీళ్లు..

మావాళ్లను వెనక్కి రప్పించండి.. ప్రభుత్వానికి జనగామ వాసులు విజ్ఞప్తి

జనగామ: కాశీ పుణ్యక్షేత్రంలో జనగామ జిల్లా వాసులు చిక్కుకున్నారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం వెళ్లిన వీళ్లు.. లాక్‌డౌన్‌ ప్రకటనతో అక్కడే ఉండిపోయారు. ఎటూ వెళ్లే పరిస్థితి లేక కన్నీరు మున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి యాదాద్రి, హైదరాబాద్, జనగామ తదితర ప్రాంతాలకు చెందిన 60 మంది కాశీ యాత్రకు వెళ్లారు. వీరిలో జనగామకు చెందిన 20 మంది భక్తులు ఉన్నారు.


కరోనా మహమ్మారి ఎఫెక్టుతో దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో వీరి ట్రైన్ టికెట్లు రద్దయ్యాయి. దీంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరు కాశీలోని లష్కర్ రోడ్డు టెంపుల్ వీధి జస్ట్ లుక్ హోటల్‌లో ఉంటున్నారు. పోలీసులు అడుగు బయటపెట్టనివ్వకపోవడంతో.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాశీకి వెళ్ళిన బృందంలో ఎక్కువగా 60 ఏళ్లు నిండిన వృద్ధులు ఉన్నారు. నాలుగు రోజులుగా బందీలుగా ఉన్న నేపథ్యంలో.. వారు అస్వస్థతకు గురైతే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కాశీలో ఉన్న భక్తులను వెనక్కి రప్పించాలని వేడుకుంటున్నారు. 

Updated Date - 2020-03-26T19:21:12+05:30 IST