రామాలయానికన్నా ముందుగానే కాశీ విశ్వనాథుని కారిడార్!

ABN , First Publish Date - 2021-08-14T12:39:09+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ డ్రిమ్ ప్రాజెక్టు అయిన...

రామాలయానికన్నా ముందుగానే కాశీ విశ్వనాథుని కారిడార్!

వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ డ్రిమ్ ప్రాజెక్టు అయిన కాశీవిశ్వనాథుని మందిర కారిడార్ పనులు ఈ ఏడాది నవంబరు 15నాటికి పూర్తికానున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామమందిర నిర్మాణ పనులు 2023 నాటికి పూర్తి కానున్నాయని భావిస్తుండగా, దానికి ముందుగానే కాశీ విశ్వనాథుని కారిడార్ పనులు పూర్తి కానున్నాయి. 


కారిడార్‌లోని ప్రధాన మార్గాలను, గంగా ఘాట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. అలాగే కాశీ విశ్వనాథుని దర్శనానికి వచ్చే భక్తులు సేద తీరేందుకు చక్కని వసతి సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న అధికారి సునీల్ వర్మ మాట్లాడుతూ కాశీ విశ్వనాథుని ఆలయ సుందరీకరణ పనులు 60 శాతానికిపైగా పూర్తయ్యాయని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా నిర్మితమవుతున్నాయన్నారు. 24 భవన సముదాయాలతో నిర్మితమవుతున్న ఈ కారిడార్ ప్రాజెక్టుకు రూ. 339 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఈ పనులన్నీ నవంబరు 15 నాటికి పూర్తి కానున్నాయని వివరించారు.

Updated Date - 2021-08-14T12:39:09+05:30 IST