Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమ్మని కషాయాలు!

ఆంధ్రజ్యోతి(17-11-2020)

చలికాలంలోకి అడుగు పెట్టాం! చల్లని వాతావరణం అన్ని రకాల వైరస్‌లతో పాటు కరోనాకూ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో వేధించే మహమ్మారుల నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి వేడిని అందించి, ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడే కషాయాలను తయారుచేసుకుని తాగుతూ ఉండాలి.


కషాయ నియమాలు

శీతాకాలం వేధించే తాత్కాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల దాకా వేటికైనా కషాయాలు వాడవచ్చు. 

ఏ కషాయమైనా పరగడుపునే తీసుకోవాలనేది ఒక సూత్రం. అంటే, ఉదయం లేదా రాత్రి ఎప్పుడైనా భోజనానికి కనీసం అరగంట ముందు తీసుకోవాలి. 

కషాయాల్లో కొన్ని  రెండు మూడు రోజులు లేదా వారం మాత్రమే వాడుకునేవి ఉంటాయి. మరికొన్ని ఇతర కషాయాలు దీర్ఘకాలం పాటు వాడుకునేవిగా ఉంటాయి. 

దీర్ఘకాలం  పాటు వాడాల్సి ఉన్నప్పుడు వరుసగా 40 రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత కూడా వాడాల్సి వస్తే, మధ్యలో ఓ 10 రోజుల పాటు మానేసి, ఆ తర్వాత మళ్లీ 40 రోజుల పాటు తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కాలం వాడాల్సి వచ్చినప్పుడు కూడా మధ్య మధ్యలో ఓ వారం 10 రోజులు వ్యవధి ఇవ్వాలి. మధ్య మఽధ్య అలా ఆపకపోతే, శరీరం ఆ మందులకు బాగా అలవాటుపడిపోయి, ప్రతిస్పందించడం మానేస్తుంది.

కషాయాల్ని రెండు పూటలా తీసుకోవలసి ఉంటే రోజూ రెండుసార్లు తయారు చేసుకోవడం కష్టమే అవుతుంది. అలాంటి వారు, ఉదయమే రెండు పూటలకు సరిపడా తయారు చేసుకోవవచ్చు. ఉదయం అందులోంచి సగ భాగం తీసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగే యాలి. మిగతా సగభాగాన్ని ఆరేడు గంటల వ్యవధిలో అంటే సాయంత్రం తీసుకోవచ్చు. కాకపోతే, కషాయాన్ని గోరువెచ్చగా చేసుకుని తాగాలి. ఏ కషాయాన్నయినా చల్లగా ఎప్పుడూ తాగకూడదు. 

500 మి. లీ. నీళ్లు తీసుకుంటే, నాలుగు చెంచాల పొడి కలిపి సన్నని మంటపైన మరిగించాలి. కాస్త వెడల్పయిన పాత్రలో ఉడికిస్తూ, మూత తీసి ఉంచాలి. ఆ నీళ్లు నాలుగో వంతు మిగిలేదాకా మరిగించి మంట ఆపేసి, చల్లార్చి, పల్చని బట్టతో వడబోయాలి. సన్నని టీ- ఫిల్టర్‌తో వడబోయవచ్చు.

Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement