Abn logo
Sep 21 2021 @ 08:25AM

కరూరు ప్రభుత్వాస్పత్రిలో కాంట్రాక్టు కార్మికుల ధర్నా

చెన్నై: కరూరు ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రిలో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న కార్మికురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు సోమ వారం ధర్నాకు దిగారు. ఆ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరూరు గాంధీగ్రామ్‌ ముల్లైనగర్‌కు చెందిన పవిత్ర అనే మహిళ ఆ ఆస్పత్రి రెండో అంతస్థులోని ప్రసూతివార్డులో ఆడబిడ్డకు జన్మ నిచ్చింది. ఆదివారం రాత్రి పది గంటలకు పవిత్రను చూడ టానికి ఆమె భర్త నవీన్‌, అతడి తమ్ముడు ఆస్పత్రికి వచ్చారు, ఆ సమ యంలో ప్రసూతివార్డు వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న జయలక్ష్మి అనే కాంట్రాక్టు కార్మికురాలు వారిని అడ్డుకుంది. ఆ సమయంలో ఆస్పత్రిలో సందర్శ కులను అనుమ తించలేమని తెలిపింది. దీంతో ఆగ్రహం చెందిన నవీన్‌ ఆమెపై దాడి జరిపారు. ఈ సంఘటనలో గాయపడిన జయలక్ష్మి ఆస్పత్రి నిర్వాహకులకు, పసుపతి పాళయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జయలక్ష్మిపై జరిగిన దాడిని ఖండిస్తూ, దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరూ ధర్నా నిర్వహించారు.