కార్తీక దీపోత్సవం

ABN , First Publish Date - 2020-11-25T06:18:15+05:30 IST

కార్తీక మాసం నేపథ్యంలో మహానంది క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది.

కార్తీక దీపోత్సవం
దీపాలు వెలిగిస్తున్న మహిళలు


మహానంది, నవంబరు 24: కార్తీక మాసం నేపథ్యంలో మహానంది క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. మహిళలు మంగళవారం వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించారు. మహారాజగోపురం పరిసర ప్రాంతాలు దీపకాంతిని సంతరించుకున్నాయి. వందలాది మంది భక్తులు మహానందీశ్వరుడిని, కామేశ్వరీదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. 


కోనేటి స్నానం లేక..

కార్తీకమాసంలో మహానంది కోనేటిలో భక్తులు పుణ్యస్నా నాలు చేయడం సంప్రదాయం. కానీ కొవిడ్‌ కారణంగా మూ డు కోనేర్లలో ఎనిమిది నెలల నుంచి దేవదాయశాఖ అధికా రులు స్నానాలను రద్దు చేశారు. కార్తీకమాసంలో కూడా అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. ఆరుబయట ఏర్పాటు చేసిన షవర్ల వద్ద స్నానాలు ముగించుకొని వెళ్ళుతున్నారు. 


29న కోటి దీపోత్సవం

మహానందిలో 29న కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ వేదపండితుడు నౌడూరి నాగేశ్వరశర్మ తెలిపారు. కార్తీక మాసంలో దీపానికి విశేష ప్రాధాన్యం ఉంటుందన్నారు. 29వ తేదీ సాయంత్రం 6గంటల నుంచి కోటి దీపోత్సవంతో పాటు జ్వాలాతోరణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు  పాటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. 

Updated Date - 2020-11-25T06:18:15+05:30 IST