Oct 20 2021 @ 11:44AM

Kartikeya: 'రాజా విక్రమార్క' విడుదల తేదీ ఖరారు

'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'రాజా విక్రమార్క'. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. శ్రీ సరిపల్లి దర్శకత్వంలో '88' రామారెడ్డి నిర్మించిన ఈ మూవీలో తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా.. సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, 'రాజా విక్రమార్క' థీమ్‌ సాంగ్‌ బాగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 12న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ తాజాగా ప్రకటిచారు. ఈ మేరకు డిఫరెంట్ లుక్‌తో ఉన్న హీరో కార్తికేయ పోస్టర్‌ను వదిలారు. గత చిత్రం 'చావు కబురు చల్లగా' కార్తికేయకు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. చూడాలి మరి త్వరలో రానున్న రాజా విక్రమార్క మూవీతోనైనా మంచి హిట్ అందుకుంటాడేమో. ఇక తెలుగులో హీరోగా నటిస్తున్న కార్తికేయ తమిళంలో స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న 'వలిమై' మూవీలో విలన్‌గా కనిపించబోతున్నాడు.