అసలు ఈ ఫొటోలతో ఏం చెప్పాలనుకుంటున్నావ్.. వెంటనే ఆపేయ్.. ఆ హీరో, హీరోయిన్ల మధ్య నెట్టింట రచ్చ..!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య సోషల్ మీడియాలో సరదా సంభాషణాలు జరగడం మాములే. అటువంటి సంభాషణే బాలీవుడ్ యంగ్ హీరో, హీరోయిన్ల మధ్య జరిగింది. తన ఫొటోను కాపీ కొట్టడం మానేయమాని ఒక హీరో, హీరోయిన్‌ను అడుగుతున్నాడు. వారి మధ్య సోషల్ మీడియాలో జరిగిన సంభాషణ మీ కోసం..


బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ఈ మధ్యనే నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించింది. ఆ శిఖరంపై తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని కార్తిక్ ఆర్యన్ అటువంటి ఫొటోలనే శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అతడు ఆ ఫొటోల్లో ఒక బ్యాగ్ ధరించి  వీపు కనిపించేటట్లు నిల్చున్నాడు. పరిణీతి ఎలాగైతే ఫోజు ఇచ్చిందో అచ్చం అలానే ఫొటోలను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోల కింద బ్రీతే అనే క్యాప్షన్ కూడా పెట్టాడు.  ఆ ఫొటోలను షేర్ చేసిన కొద్ది సేపటికే ఆర్యన్ తన ఫొటోలను కాపీ కొట్టాడని పరిణీతి గుర్తించింది. ఆ ఫొటోలను రీపోస్ట్ చేస్తూ దాని కింద..‘‘ నా ప్రియమైన కార్తిక్ ఆర్యన్ నీకు ఏమని చెప్పాలి’’ అని రాసింది.


ఆ కామెంట్‌కు కార్తిక్ ఆర్యన్ రిప్లై ఇస్తూ..‘‘ నా ఫొటోలను కాపీ కొట్టడం ఆపేయి పరి ’’ అని రాశారు. పరిణీతి దానికి బదులిస్తూ..‘‘ ఎవరు, ఎవరిని కాపీ చేశారో చూద్దాం. నిజం చెప్పాలంటే దమ్ము ఉండాలి ’’ అని రాసింది. హీరో, హీరోయిన్ల మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కార్తిక్ ఆర్యన్ ప్రస్తుతం  బూల్ బూలయ్య -2, ఫ్రెడ్డీ చిత్రాల్లో నటిస్తున్నారు. సూరజ్ బర్జత్యా  దర్శకత్వం వహించబోయే ఒక చిత్రంలో పరిణీతి చోప్రా నటిస్తోంది. ఆ చిత్రంలో  అనుపమ్ ఖేర్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Advertisement

Bollywoodమరిన్ని...