కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం

ABN , First Publish Date - 2020-11-29T05:24:12+05:30 IST

శ్రీశైలం మహాక్షేత్రంలో ఆదివారం కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం సందర్భంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది.

కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు  ఏర్పాట్లు సిద్ధం


 శ్రీశైలం, నవంబరు 28: శ్రీశైలం మహాక్షేత్రంలో  ఆదివారం కార్తీక పౌర్ణమి,  మూడో సోమవారం సందర్భంగా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఆది, సోమవారం రోజులలో భక్తుల రద్దీని దృష్ఠిలో ఉంచుకొని దర్శనాలను ఉదయం 4:30 నుంచి సాయంకాలం 4:30 వరకు, అదేవిధంగా తిరిగి 5!30 నిమిషముల నుంచి రాత్రి 10  గంటల వరకు దర్శనం కొనసాగుతుందని ఈవో కెఎస్‌ రామరావు తెలిపారు. అదేవిధంగా అర్జిత అభిషేకాలు ఐదు విడతలుగా నిర్వహించనుంది. 


నేడు మహానందిలో  కోటి దీపోత్సవం 

మహానంది, నవంబరు 28: మహానంది క్షేత్రంలో కార్తీక శుద్ధ పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 6గంటలకు కోటి దీపోత్సవాన్ని నిర్వహి స్తున్నట్లు ఆలయ వేదపండితులు రవిశంకర్‌ అవధాని శనివారం తెలిపారు. కార్తీక మాసంలో దీపానికి అత్యంత ఫ్రాధాన్యత ఉంటుం దన్నారు. ఇందులో భాగంగానే కార్తీకపౌర్ణమి రోజు ఆలయం పరిసరాల్లో కోటి దీపాలను వెలిగిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు జ్వాల తోరణాన్ని వెలిగిస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-11-29T05:24:12+05:30 IST