Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 09:51:51 IST

Karthikeya 2: నాలుగురోజుల్లో వచ్చిన వసూళ్ళు ఎంతంటే..?

twitter-iconwatsapp-iconfb-icon

ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన నిఖిల్ (Nikhil) ‘కార్తీకేయ 2’ (Karthikeya 2) బాకాఫీస్ వద్ద వసూళ్ళ సునామీని సృష్ఠిస్తోంది. ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’ తర్వాత మళ్ళీ అలాంటి సక్సెస్‌లు అందుకున్న సినిమాలు రాలేదు. అదీకాక కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్స్ వరకు వెళ్ళాలంటే ఆలోచిస్తున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, గత ఏడాది వకీల్ సాబ్, అఖండ, పుష్ప లాంటి చిత్రాలు..ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు ఇది తప్పు అని నిరూపించాయి. 

అలా మరోసారి థియేటర్స్ వరకు రప్పించిన సినిమాలు కార్తికేయ 2, సీతా రామం, బింబిసార. పెద్ద గ్యాప్ లేకుండా వచ్చిన ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను తెచ్చుకొని వసూళ్ళ పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా పలు వాయిదాల తర్వాత, అంత అంచనాలు లేకుండా వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు దక్కుతున్న ప్రేక్షకాధరణతో రోజురోజుకి మల్టీప్లెక్స్‌లలో షోలు పెరుగుతున్నాయి.

ఈ సినిమా విడుదలైన నాలుగురోజుల్లో 35.1 కోటి గ్రాస్ ని వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేస్తూ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా పోస్టర్‌ను వదిలారు. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ హిట్‌గా నిలిచింది కార్తికేయ 2. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకుడు. గతంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. తెలుగులో మాత్రమే కాకుండా కార్తికేయ 2 నార్త్‌లో దుమ్మురేపుతోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement