Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 19:39:00 IST

Karthikeya 2: బాలీవుడ్ సినిమాలకు మించి వసూళ్లను రాబడుతోన్న ‘కార్తికేయ-2’

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) నటించిన చిత్రం ‘కార్తికేయ-2’ (Karthikeya 2). పాన్ ఇండియాగా రూపొందింది. పలు భాషల్లో ఆగస్టు 13న విడుదల అయింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభాలను పంచి పెట్టింది. హిందీ వెర్షన్ కూడా అద్భుతమైన వసూళ్లను రాబడుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మించి కలెక్షన్స్‌ను కొల్లగొడుతుంది.      


ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ (Laal Singh Chaddha), అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ (Raksha Bandhan) ఒకే రోజు విడుదల అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలయ్యాయి. ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీ బెల్ట్‌లో మొదటగా 50షోస్ ప్రదర్శించారు. అనంతరం మౌత్ టాక్ బాగుండటంతో డిస్ట్రిబ్యూటర్స్ 2000వరకు షోస్‌ను పెంచారు. హిందీ సినిమాల కంటే షోస్ తక్కువగా ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం బాగున్నాయి. ఆగస్టు 18న ‘లాల్ సింగ్ చడ్డా’ రూ. 1.3కోట్లు, ‘రక్షాబంధన్’ రూ. కోటి వసూళ్లను మాత్రమే రాబట్టాయి. ‘కార్తికేయ-2’ హిందీ వెర్షన్ మాత్రం ఈ రెండు చిత్రాలను మించి రూ. 1.64కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు మించి ‘కార్తికేయ-2’ వసూళ్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు నివ్వెర పోయాయి. ‘కార్తికేయ-2’ కు చందు మొండేటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, వెంకటేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement