Advertisement
Advertisement
Abn logo
Advertisement

దానేశ్వరి సన్నిధిలో లక్ష కుంకుమార్చన

తణుకు, నవంబరు 26 : దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీక శుక్రవారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులతో ఆలయ పూజారి సరిదే పాలశంకరం శాస్త్రోక్తంగా చేయించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నట్టు ఈవో ధారబాబు తెలిపారు.

శివాలయాల్లో లక్షపత్రి పూజలు

తాడేపల్లిగూడెం రూరల్‌/పెరవలి/ఉంగుటూరు, నవంబరు 26:కార్తీక మాసం సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివాలయం వద్ద, పెరవలి మండలం ఖండవల్లిలోని మార్కండేశ్వరస్వామి ఆలయంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో, ఉంగుటూరు మండలం కైకరం పార్వతీ సమేత రామలింగేశ్వరాలయంలో శుక్రవారం లక్షపత్రి పూజలు, జ్యోతిర్లింగార్చన వైభవంగా నిర్వహించారు. 

Advertisement
Advertisement