Advertisement
Advertisement
Abn logo
Advertisement

కన్నులపండువగా కార్తీక దీపోత్సవం

పుంగనూరు, డిసెంబరు 4: పుంగనూరు కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయ సమీపంలోని కోనేటిలో లక్ష దీపోత్సవాన్ని శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి మంగళవాయిద్యాల నడుమ శివనామ స్మరణతో పుష్కరిణి వద్దకు అఖండ దీపాలను తీసుకెళ్లారు.పట్టణ మహిళలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలనుంచి తరలివచ్చి దీపాలను వెలిగించారు. కమిషనర్‌ కెఎల్‌. వర్మ, ఎంపీపీ భాస్కర రెడ్డి, జానపద కళల అకాడమీ చైర్మన్‌ నాగభూషణం, హిందూజాగరణ సమితి సభ్యులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement