భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధనలు

ABN , First Publish Date - 2021-11-30T07:09:05+05:30 IST

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో కార్తీక దీపారాధనలు
వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి


కార్తీక సోమవారం సందర్భంగా జిల్లాలోని పలు దేవాలయాల్లో భక్తులు పూజలు చేశారు. చెర్వుగట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు గోపాలపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో, వివిధ మండలాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు, హారతి నివేదనలు వైభంగా సాగాయి.

నల్లగొండ కల్చరల్‌  :  కార్తీక సోమవారం సోమవారం సందర్భంగా పానగల్‌లోని ఛాయా, పచ్చల సోమేశ్వరాలయాలతో పాటు తులసీనగర్‌ శ్రీభక్తాంజనేయ స్వామి ఆలయం, వీటీ కాలనీ శ్రీదేవిభూదేవి సహిత వెంకటేశ్వశరస్వామి ఆలయం, షేర్‌ బంగ్లాలోని సంతోషిమాతా ఆలయం, రామగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం, బీట్‌ మార్కెట్‌లోని శ్రీరామకోటి స్థూప దేవాలయంలో కార్తీక మాసం సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని ఇష్టదైవాన్ని దర్శించుకొని పూజలు చేశారు. నల్లగొండలోని వివేకానంద నగర్‌లోగల సీతారామాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి, అన్నాభిషేకం, పల్లకిసేవ, ఊరేగింపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కార్యక్రమంలో బీజేపీ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బండారు ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్‌ ధనలక్ష్మి, కాలనీవాసులు మాధవి, మమత, వసంత, రాజమ్మ, భక్తులు ఉన్నారు. నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  పెద్ద సంఖ్యలో  సత్యదేవుని సామూహి వ్రతాలను ఆచరించారు.  దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లోని శివాలయాల్లో పూజలు చేశారు.  

 భక్తిభావం పరిఢవిల్లాలి: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే

 ప్రతీ ఒక్కరిలోరూ భక్తిభావం పరిఢవిల్లాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చెర్వుగట్టులో నూతనంగా నిర్మించిన ఆలయంలో  రేణుకా ఎల్లమ్మ విగ్రహప్రతిష్ఠాపన మహోత్సవంలో వారు వేర్వేరుగా పాల్గొన్నారు.  వేడుకల్లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ మల్గ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి, పుల్లెంల యాదయ్య, చిరుమర్తి యాదయ్య, అలుగుబెల్లి సత్తిరెడ్డి, మేకల కరుణాకర్‌రెడ్డి, గోదల వెంకట్‌రెడ్డి, దాసోజు కోటి, చెర్వుగట్టు దేవస్థాన మాజీ చైర్మన్‌ రేగట్టె రాజశేఖర్‌రెడ్డి, పుల్లెంల అచ్చాలు, గడ్డం పశుపతి, బింగి కొండయ్య, వేముల నరింహ, ముంత వెంకన్న, కె.నర్సింహ, శివరాం, శంకర్‌ పాల్గొన్నారు. 

ఆలయాలు సంస్కృతికి ప్రతీకలు: ఎమ్మెల్యే కంచర్ల

 ఆలయాలు సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీకలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. కనగల్‌లోని వేణుగోపాలస్వామి ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణాన్ని యాదగిరిగుట్ట ఆలయ ప్రధాన అర్చకుడు కారంపూడి నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నర్సింహాచార్యులు, భాస్కరాచార్యులు, వెంకన్నచార్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ధ్వజస్థంభం వద్ద ప్రత్యేక పూజలు చేసారు. గుడి నిర్వాహణకు రూ.1 లక్ష 50 వేలను విరాళంగా అందజేశారు. కాగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు అక్కినేపల్లి శ్రీనివా్‌సరావ్‌, తిర్మల్‌నాఽథ్‌ దంపతులు, సర్పంచ్‌ సునితాకృష్ణయ్యగౌడ్‌ దంపతులు, మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సగౌడ్‌, మందడి రాంచంద్రారెడ్డి, లక్ష్మయ్యగౌడ్‌, చిట్ల లింగయ్య, నక్కవెంకన్న, జానయ్య, హఫీజ్‌తో పాటు కనగల్‌, చుట్టు పక్క గ్రామాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 4000 మంది భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మునిసిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి, ఎంపీపీ కరీంపాష, జడ్పీటీసీ వెంకటేశం, వైస్‌చైర్మన్‌ శ్రీధర్‌రావ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాదయ్యగౌడ్‌, జియావుద్దీన్‌, కోఆప్షన్‌మహ్మదాలీ, దోటి శ్రీను, రాయలగిరి, శంకర్‌నాద్‌, మదు, డి.యాదగిరి, ఎం.పరమేష్‌, మహేష్‌, జగతయ్య వార్డుసబ్యులు తిరుపతి, శంకర్‌, కిషన్‌  పాల్గొన్నారు.


Updated Date - 2021-11-30T07:09:05+05:30 IST