Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉస్మాన్‌సాహెబ్‌పేట 1111 దీపాలతో కార్తీక దీపారాధన

1111 దీపాలతో కార్తీక దీపారాధన

నెల్లూరు (సాంస్కృతికం), డిసెంబరు 3 : నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌ పేటలో గల అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాఽథ స్వామి ఆలయంలో శివలింగాకృతిలో 1,111 దీపాలను భక్తులు వెలిగించారు. ఈ సందర్భంగా ఉదయం పాలాభిషేకాలు, పంచామృతాభిషేకాలు, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు జరిగాయి. మధ్యాహ్నం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రాత్రి పూలంగిసేవ, కార్తీక దీపారాధన జరిగాయి. ఆలయ చైర్మన్‌ కామేశ్వరరావు, ధర్మకర్తలు పర్యవేక్షించారు. 


Advertisement
Advertisement