ప్రతీరోజూ పాముల వెంట పరుగులు.. 26 ఏళ్లుగా ఓ యువకుడి వింత ప్రయాణం.. ఇప్పటికే 33 వేల పాములను..

ABN , First Publish Date - 2022-06-29T17:35:54+05:30 IST

పాము పేరు విన్నా, చూసినా మనకు రోమాలు...

ప్రతీరోజూ పాముల వెంట పరుగులు.. 26 ఏళ్లుగా ఓ యువకుడి వింత ప్రయాణం.. ఇప్పటికే 33 వేల పాములను..

పాము పేరు విన్నా, చూసినా మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ఒడిశాలోని బాలేశ్వర్‌ నగరంలోని ఐటీఐ సమీపంలో నివసించే కార్తీక్‌ సేథి ఏ జాతికి చెందిన పామునైనా సులభంగా పట్టుకుంటాడు. ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి చేరుకుని పామును పట్టుకుంటాడు. నాలుగు రోజుల పాటు ఆ పాములను తమ ఇంటిలో ఒక మూలన ఉంచి, ఆ తర్వాత ఆ విషపూరిత పాములను నీలగిరిలోని అడవిలో వదిలేస్తాడు. మీడియాతో మాట్లాడిన కార్తీక్ సేథి తాను గత 26 సంవత్సరాలుగా విషపూరిత పాములను పట్టుకునే పనిలో ఉన్నానని చెప్పాడు. ఈ పాములను పట్టుకోవడంలోఎటువంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకపోయినా తన తెలివితేటలు, ధైర్యంతో ఈ పాములను పట్టుకుంటున్నాడు. 


గత 26 ఏళ్లలో సోరో, బస్తా, జలేశ్వర్, బాలేశ్వర్ నగరం, గోపాల్‌పూర్, అంజి, సిములియా తదితర ప్రాంతాలలో 33 వేలకు పైగా విషపూరిత పాములను పట్టుకున్నట్లు ఆయన తెలిపాడు. నీలగిరి అడవుల్లో ఈ పాములను వదిలేస్తానని కార్తీక్ చెప్పాడు. కార్తీక్ సేథి కరోనా కాలంలో కూడా ప్రజలను పాముల నుండి రక్షించడానికి చొరవ తీసుకున్నాడు. ఇందుకోసం కార్తీక్ ఎటువంటి రుసుము వసూలు చేయడు. కరోనా కాలంలో కూడా తన మొబైల్‌కి ప్రతిరోజూ 4 నుండి 5 ఫోన్ కాల్స్ వచ్చేవని కార్తీక్ చెప్పాడు. అప్పట్లో లాక్‌డౌన్ కారణంగా పోలీసులు అందరినీ అడ్డుకునేవారని, తాను పాములు పట్టేందుకు వెళుతున్నానని చెప్పగానే పోలీసుల వదిలివేసేవారన్నారు. కరోనా కాలంలో పాములను పట్టుకున్నందుకు కార్తీక్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు.




Updated Date - 2022-06-29T17:35:54+05:30 IST