కార్తీక్ మౌన రోదన..ఇంకెంత కాలం భరించాలి..?

ABN , First Publish Date - 2022-02-22T17:07:43+05:30 IST

సుమారుగా 34 సంవత్సరాలు గడిచిపోయాయి. కార్తీక్ మౌనంగానే రోదిస్తున్నాడు. అరుదైన జన్యు సంబంధ మార్పు వల్ల ఒక కణితి అతని ముఖమంతా...

కార్తీక్ మౌన రోదన..ఇంకెంత కాలం భరించాలి..?

సుమారుగా 34 సంవత్సరాలు గడిచిపోయాయి. కార్తీక్ మౌనంగానే రోదిస్తున్నాడు. అరుదైన జన్యు సంబంధ మార్పు వల్ల ఒక కణితి అతని ముఖమంతా వ్యాపించి తీవ్రమైన బాధను కలిగిస్తోంది. కార్తీక్‌కి ఇప్పుడు అత్యవసరంగా చికిత్స జరగాల్సి ఉంది.


కార్తీక్ పసి బాలుడిగా ఉన్నప్పుడే ఈ వేదనకు బీజం పడింది. నిరుపేదలు కావడంతో అతనికి చికిత్స చేయించడానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడానికి ఆ కుటుంబం నానా అగచాట్లు పడుతూ వస్తోంది.


    కార్తిక్‌కు సాయం చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..


కార్తీక్ తండ్రి మాత్రమే ఆ కుటుంబంలో సంపాదనపరుడు. ఆయన రోజువారీ కూలీ కావడంతో ఆ పిల్లవాడి సమస్యను గుర్తించి ఏదైనా చెయ్యడానికి నెలల సమయం పట్టింది. పలు సర్జరీలు చేసినప్పటికీ ఆ కణితి పెరిగిపోతూ వచ్చింది.


సరిగ్గా 15 సంవత్సరాలు వచ్చేసరికి, కార్తీక్ ముఖంపై ఏర్పడ్డ ఆ కణితి అతని కంటి చూపును దెబ్బతీసే వరకూ వచ్చింది. తన ఎడమ కంటి నుంచి తరచుగా రక్తం కారుతుండేది. ఆ నిరుపేద కుటుంబీకులు బాధపడుతూ చూస్తుండటం తప్ప మరేమీ చెయ్యలేకపోయేవారు.


      కార్తిక్‌కు సాయం చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..


కార్తీక్‌ని చూడటానికి గానీ, అతని సమస్యను గుర్తించి సహకరించడానికి గానీ అతని పరిసరాల్లో ఉండే డాక్టర్లు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. మరోపక్క అతనికి వైద్యం చేయించడానికి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం ఆ కుటుంబానికి చాలా కష్టమయ్యేది.


20 ఏళ్ళు ఈ బాధతోనే గడిచిపోయింది. కార్తీక్ ఈ వేదనను ఇంకెంత  కాలం భరించాలి? ఆ కణితి అతని రూపాన్ని పూర్తిగా మార్చేస్తూ ఎంతో బాధ కలిగిస్తోంది. వీలైనంత త్వరగా అతనికి సర్జరీ చేయించాలి.


"ఈ సర్జరీల వల్ల కార్తీక్ ముఖం మీదున్న కణితి పూర్తిగా పోదు కానీ, తనకు ఆ బాధ కాస్త తగ్గి ఉపశమనం పొందుతాడు. చక్కని జీవితాన్ని గడపడానికి అతనికి మరొక అవకాశం లభించాలి...." అని కార్తీక్ సోదరుడు తన మనసులోని మాట చెప్పాడు.


అయితే, దురదృష్టవశాత్తూ ఈ సర్జరీకి భారీగా రూ.40 లక్షలు (53,036.68 డాలర్లు)  ఖర్చు అవుతుందని అంచనా వేశారు.


సంవత్సరాల తరబడి నానా పాట్లు పడుతున్న కార్తీక్ కుటుంబం ఈ ఖర్చును భరించే స్థితిలో ఎంతమాత్రం లేదు. కానీ, తమ వాడిని సంతోషపరిచేందుకు మరో అవకాశాన్ని కోరుకుంటున్నారు.


              కార్తిక్‌కు సాయం చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..


కార్తీక్ కుటుంబం ఇప్పుడు మీ సహాయాన్ని కోరుతోంది. వారి కల నెరవేరేందుకు మీ తోడు ఎంతో అవసరం. మీరందించే ప్రతి రూపాయి కార్తీక్ కోరుకుంటున్న ప్రశాంత జీవితాన్ని అందించే అవకాశముంది.


"మావాళ్ళు చెయ్యగలిగిందంతా చేశారు. నాకు సర్జరీలు చేయించడం కోసం డబ్బు సమకూర్చుకోవడానికి నెలల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు ఈ కణితి పెరిగిపోతూ వచ్చింది. చివరికి మా వల్ల కావడంలేదని అర్థమైంది. సర్జరీ సంగతి అలా ఉంచితే.... ఆకలి తీర్చుకోవడానికి కూడా డబ్బులేని పరిస్థితి వచ్చింది" అంటూ తమ దుస్థితి వివరించాడు కార్తీక్.


          కార్తిక్‌కు సాయం చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..


తన పరిస్థితి ఇంత వేదనాభరితంగా ఉన్నప్పటికీ... సాధారణ జీవితాన్ని గడపటానికి కార్తీక్ ఎంతో ప్రయత్నించేవాడు. కానీ, అతని తోటివారు, సమాజం అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు.


స్కూల్‌లో అయితే, కార్తీక్ రూపాన్ని చూసి మిగిలినవారంతా వెక్కిరించి వేళాకోళం చేసేవారు. చివరికి బడి మానేయాల్సి వచ్చింది. ఈ వేధింపులు, పరిహాసాలు తట్టుకోలేక ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది.


                   కార్తిక్‌కు సాయం చేయడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి..



Updated Date - 2022-02-22T17:07:43+05:30 IST