Jun 12 2021 @ 09:17AM

‘బుట్ట‌బొమ్మ‌.. ’ సాంగ్‌కు బాలీవుడ్ హీరో స్టెప్పులు

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ కాంబోలో రూపొందిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో అంద‌రికీ తెలిసిందే. అయితే సినిమా కంటే ముందు పాట‌లు మ‌రింత సెన్సేష‌న్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బుట్ట‌బొమ్మ సాంగ్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. చిన్నా పెద్ద నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రూ ఈ పాట‌కు స్టెప్పులేశారు. ఈ లిస్టులో రీసెంట్‌గా మ‌రో సెల‌బ్రిటీ కూడా చేరాడు. త‌నెవ‌రో కాదు..బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్య‌న్‌. అయితే బ‌న్నీ వేసిన స్టెప్స్ కాకుండా వేరే స్టెప్స్‌తో కార్తీక్ ఆర్య‌న్ ఆక‌ట్టుకున్నాడు. ఈ డాన్సింగ్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 


Bollywoodమరిన్ని...