కుండలపై కర్రసాము విన్యాసాలు

ABN , First Publish Date - 2021-12-20T16:05:34+05:30 IST

విరుదునగర్‌ జిల్లా క్రీడా మైదానంలో 100 మంది విద్యార్థులు కుండల పైన కర్రసాము సాధన చేశారు. నెహ్రూ యువకకేంద్రం, తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ, విదైగళ్‌ సిలంబం అకాడమీ, జెట్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌

కుండలపై కర్రసాము విన్యాసాలు

                  - విరుదునగర్‌ విద్యార్థుల సాధన


పెరంబూర్‌(చెన్నై): విరుదునగర్‌ జిల్లా క్రీడా మైదానంలో 100 మంది విద్యార్థులు కుండలపైన కర్రసాము సాధన చేశారు. నెహ్రూ యువకకేంద్రం, తమిళనాడు క్రీడాభివృద్ధి శాఖ, విదైగళ్‌ సిలంబం అకాడమీ, జెట్లీ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మట్టికుండల పరిశ్రమకు భద్రత కల్పించాలని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరజవాన్లను స్మరిస్తూ, కరోనా నివారణ చర్యల్లో పాల్గొంటున్న ప్రభుత్వ శాఖల సిబ్బందిని అభినందించేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి గణేశన్‌, జిల్లా క్రీడల అధికారి రాజా, నెహ్రూ యువకేంద్రం జిల్లా యువజన అధికారి జ్ఞానచంద్రన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో 100 మంది విద్యార్థులు కుండల పైకెక్కి 30 నిముషాలు కర్రసాము చేస్తూ పలురకాల విన్యాసాలు ప్రదర్శించారు. విద్యార్థులకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.

Updated Date - 2021-12-20T16:05:34+05:30 IST