రాజీనామా చేయనున్న కర్ణాటక మంత్రి..?

ABN , First Publish Date - 2021-08-11T21:19:57+05:30 IST

శాఖల కేటాయింపు విషయంలోనే బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన కర్ణాటక పర్యాటక..

రాజీనామా చేయనున్న కర్ణాటక మంత్రి..?

బెంగళూరు: శాఖల కేటాయింపు విషయంలోనే బాహాటంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసిన కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి ఆనంద్ సింగ్ రాజీనామాకు సిద్ధపడుతున్నారు. బుధవారం ఆయన రాజీనామా చేసే చేసే అవకాశాలున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే, ఆయన తనకు అందుబాటులోనే ఉన్నారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. ఆనంద్ సింగ్ 30 ఏళ్లుగా తన మిత్రుడనీ, ఆయనతో ఇవాళ మాట్లాడతానని, కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. మరో అసంతృప్తి మంత్రి ఎంబీటీ నాగరాజ్‌ అంశం పరిష్కారమయిందని చెప్పారు.


బసవరాజ్ బొమ్మై ఇటీవల 29 మందితో క్యాబినెట్ విస్తరణ చేశారు. జీ సీఎం బీఎస్ యడియూరప్ప విధేయులైన పలువురు బీజేపీ నేతలకు ఇందులో చోటు దక్కకపోవడంతో బాహాటంగానే కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణం, పర్యాటక శాఖను తాను అడగనే లేదని ఆనంద్ సింగ్‌ మీడియా ముందు పేర్కొన్నారు. పార్టీ వేదికపై తాను చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ కోరిన శాఖలు దక్కవు కదా అంటూ సీఎం ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు నేతల్లో మరింత అసంతృప్తిని పెంచినట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-08-11T21:19:57+05:30 IST