Karnatakaలో కొవిడ్ క్లస్టర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ

ABN , First Publish Date - 2021-12-10T14:27:13+05:30 IST

ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విద్యార్థుల హాస్టళ్లు, కొవిడ్ క్లస్టర్‌లకు వేర్వేరు మార్గదర్శకాలను జారీ చేశామని...

Karnatakaలో కొవిడ్ క్లస్టర్ల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ

బెంగళూరు: ఒమైక్రాన్ కొత్త వేరియెంట్ వ్యాప్తి నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో కొవిడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా విద్యార్థుల హాస్టళ్లు, కొవిడ్ క్లస్టర్‌లకు వేర్వేరు మార్గదర్శకాలను జారీ చేశామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటును పరిగణనలోకి తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని, అయితే నిపుణుల కమిటీ సూచించినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘‘హాస్టళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశాం, వీటిలో శానిటైజేషన్, సామాజిక దూరం పాటించడం, వంట సిబ్బందికి టూ డోస్ వ్యాక్సినేషన్ ఇవ్వడం, ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలి.’’ అని బొమ్మై చెప్పారు.


ఈ సమావేశంలో మంత్రులు సూచించిన విధంగా కొవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను మళ్లీ ముమ్మరం చేస్తామని సీఎం పేర్కొన్నారు.రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు. కేరళ నుంచి వచ్చే విద్యార్థులకు డబుల్ డోస్ వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించడంపై పరిస్థితిని సమీక్షించి వచ్చే వారం తగిన నిర్ణయం తీసుకుంటామని సీఎం బొమ్మై వివరించారు.

Updated Date - 2021-12-10T14:27:13+05:30 IST